హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : రిటైర్డ్ ఉద్యోగులకు ఇక పీఆర్సీ వర్తించదా? కరువుభత్యం కలగానే మిగిలిపోతుం దా? ఇన్నాళ్లూ హక్కుగా ఉన్న ‘పెంపు’, ఇకపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దయపై ఆధారపడబోతున్నదా? అంటే భవిష్యత్తులో ఇదే జరుగబోతున్నదని పెన్షనర్ల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం నిరుడు గుట్టుగా తీసుకొచ్చిన ‘వ్యాలిడేషన్ యాక్ట్-25’తో పెన్షనర్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొంటున్నారు. ఈ చట్టంతో పెన్షన్ పెంపు, డీఏ వర్తింపు హక్కులను కేంద్రం పూర్తిగా హరించిందని మండిపడుతున్నారు. దేశంలోని 99 లక్షలకు పైగా ఉన్న పెన్షనర్లు రోడ్డునపడే ప్రమాదం ఉన్నదని, ఈ చట్టంపై రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపకపోవ డం అనుమానాలకు తావిస్తున్నదని అంటున్నా రు. పెన్షనర్ల హక్కులను హరించే ఈ యాక్ట్‌ను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు రాష్ట్ర ప్రభు త్వం మద్దతివ్వాలని కోరుతున్నారు.
రిటైర్డ్ ఉద్యోగులను పక్కనపెట్టి..
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కేంద్రం నిరుడు మార్చి లో ‘సెంట్రల్ సివిల్ సర్వీసెస్(పెన్షన్) వ్యాలిడేషన్ యాక్ట్-202 5’ను ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం ఆర్థికపరమైన అం శాలపై తుది నిర్ణయం తీసుకునే అధికా రం కేంద్రానికే దక్కుతుంది. ఈ క్రమంలోనే కేంద్రం పే క మిషన్‌ను నియమించింది. ఈ పే కమిషన్ టర్మ్ ఆఫ్ రెఫరెన్స్‌లో(నిబంధనల్లో) ఉద్యోగుల వేతన సవరణకు మాత్రమే సిఫార్సులు చేయాలని సూచించింది. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ సవరణ అంశా న్ని పొందుపరచలేదు. నాన్ కాంట్రిబ్యూటరీ పెన్షనర్స్పై సమీక్షించి తగిన సిఫార్సులు చేయాలని సూచించింది. అంటే పెన్షన్‌ను కేంద్రం సమయానుకూలంగా సవరించవచ్చన్నమాట. ఒకవైపు ఆర్థిక నిర్ణయాలపై పూర్తి అధికారాన్ని కేంద్రం లాక్కోవడం, మరోవైపు 8వ పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌లో కొత్త నిబంధనలు ఉండటంతో పెన్షనర్లలో కలవరం మొదలైంది.
సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం
ఉద్యోగుల పెన్షన్ హక్కును కేంద్రం తన పరిధిలోకి తీసుకోవడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని నిపుణులు పేర్కొంటున్నారు. గతంలో ‘1972 పెన్షన్ చట్టాన్ని’ అన్ని రకాల పెన్షనర్లకు వర్తించలేదు. దీంతో ఈ అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. దీనిపై 1982లో తుది తీర్పు ఇచ్చింది. ఉద్యోగ విరమణ పొందిన వారిని, విరమణ తేదీతో సంబంధం లేకుండా సమానంగా చూడాలని ఆదేశించిం ది. దీంతో కేంద్రం ప్రకటించిన మొదటి పీఆర్సీని రిటైర్మెంట్ తేదీతో సంబంధం లేకుండా అందరికీ వర్తింపజేసింది. అంతేకాదు, పింఛన్ రిటైర్డ్ ఉద్యోగుల హక్కు అని, పెన్షనర్లను ఎట్టి పరిస్థితుల్లో విభజించరాదని డీఎస్ నకారా కేసులోనూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పు డు కేంద్రం తీసుకున్న నిర్ణయాలు ఈ రెండు తీర్పులకు విరుద్ధమని పెన్షనర్ల జేఏసీ నేతలు చెప్తున్నారు. గతంలో పీఆర్సీ, డీఏలు చట్టబద్ధమైన హక్కులు కాగా, ఇక నుంచి కేంద్రం ఇస్తే ఇచ్చినట్టు, లేదంటే లేదన్నట్టుగా మారుతుందని పెన్షనర్ల సంఘాల నేతలు అంటున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడే పరిస్థితి ఉత్పన్నం అవుతుందంటున్నారు. ఇటీవలే కేం ద్రం యూనిఫైడ్ పెన్షన్ పథకాన్ని(యూపీఎస్) తీసుకొచ్చింది. పెన్షనర్లందరినీ ఈ పథకంలోకి నెట్టివేస్తుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
1972 నుంచి అమలు చేస్తారా?
వ్యాలిడేషన్ యాక్ట్‌ను 1972 నుంచి అమలుచేసే ప్రమాదం కూడా పొంచి ఉన్నదని పెన్షనర్ల సంఘాల నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు 1972 నుంచి అమల్లోకి వస్తాయన్నమాట. కొత్త చట్టంతో పెన్షనర్లను వర్గీకరించే అధికారం కేంద్రానికి ఉన్నదని, దీంతో రిటైర్మెంట్ తేదీని ప్రామాణికంగా తీసుకుని వర్గీకరించవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ లెక్కన 2026 జనవరి 1కి ముందు రిటైర్ అయిన వారు, ఆ తర్వాత రిటైర్ అయిన వారుగా విభజిస్తారని చెబుతున్నారు. ఇప్పటికే అరకొర పెన్షన్‌తో అనేక ఇబ్బందులు పడుతున్నామని, డీఏ, పీఆర్సీ కూడా కట్‌చేస్తే తమ పరిస్థితి మరింత దుర్భరంగా మారుతుందని పెన్షనర్లు వాపోతున్నారు. 30-40 ఏండ్లు ప్రభుత్వ విభాగాల్లో సేవలందించిన లక్షల మంది ఉద్యోగులు రోడ్డు న పడుతారని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
క్రమంగా రాష్ర్టాలకు!
పెన్షన్ వ్యాలిడేషన్ చట్టం రానున్న కాలంలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల మెడకు చుట్టుకుంటుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సెం ట్రల్ పే కమిషన్ నిబంధనలను ఇప్పటికే 15 రాష్ర్టాలు అమలుచేస్తున్నాయి. కేంద్రం ఏ ని ర్ణయం తీసుకుంటే అవే నిబంధనలు ఆ 15 రాష్ర్టాల్లో వర్తిస్తాయన్నమాట. కేంద్రం మాత్రం తాజా నిబంధన కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అని, రాష్ర్టాలకు కాదని చెప్తున్నది. కానీ పెన్షనర్లు మాత్రం నమ్మడం లేదు. సీపీఎస్‌ను అమలుచేసినప్పుడు తొలుత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకే అని చెప్పి, ఆ తర్వాత రాష్ర్టాల్లోనూ అమలుచేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. పైగా వ్యాలిడేషన్ యాక్ట్‌పై అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు ఆలిండియా పెన్షనర్ల ఫోరం ప్రతినిధులు ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌తో భేటీ అయ్యారు. ఇది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు మాత్రమేనని ఆమె చెప్పారు. ఇదే విషయాన్ని లిఖిత పూర్వకంగా రాసివ్వాలని వారు కోరగా, మంత్రి దాటవేశారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ఈ చట్టాన్ని అమలు చేస్తున్నదని, దేశమంతటా విస్తరించే అవకాశమున్నదని అంటున్నారు.
తెలంగాణలోనూ అమలుచేస్తారా?
వ్యాలిడేషన్ యాక్ట్‌ను తెలంగాణలోనూ అమలుచేస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చట్టంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ తన స్పందన తెలుపలేదని, అవునని గానీ, కాదని గానీ స్పష్టత ఇవ్వలేదని చెప్తున్నారు. మరోవైపు కేంద్రం తీసుకునే అనేక నిర్ణయాలను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్వాగతిస్తున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. కేంద్రం నుంచి సాధ్యమైనన్ని నిధులు రాబట్టుకునేందుకు, ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సత్సంబంధాలే కోరుతున్నదని అంటున్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం ఆదేశిస్తే వ్యాలిడేషన్ యాక్ట్‌ను అమలుచేస్తారన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 3లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేండ్లు కావస్తున్నా, ఇప్పటికీ పీఆర్సీ ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకొచ్చిన యాక్ట్‌ను సాకుగా చూపి, పెన్షనర్లకు పీఆర్సీ ఎగ్గొట్టే ప్రమాదం ఉన్నదని పెన్షనర్ల జేఏసీ నేతలు అనుమానిస్తున్నారు.
పెన్షనర్ల పోరుబాట
వ్యాలిడేషన్ యాక్ట్‌ను వ్యతిరేకిస్తూ ఇప్పటికే పెన్షనర్లు ఆందోళనబాట పట్టారు. ఆలిండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ నేతృత్వంలో ఉద్యమ కార్యాచరణ ప్రారంభమైంది. ఈ నెల 25న అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చారు. మరోవైపు న్యాయపోరాటానికి కూడా సిద్ధమవుతున్నారు. ఈ యాక్ట్‌ను నిరసిస్తూ ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు కూడా వేశారు. ఇదే కేసులో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు సైతం ఇంప్లీడ్ అయ్యారు.
ఇది నల్లచట్టం.. ఉపసంహరించాల్సిందే
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాలిడేషన్ యాక్ట్-2025 ఒక నల్ల చట్టం. ఈ చట్టాన్ని ఉపసంహరించాల్సిందే. ఈ యాక్ట్ అందరికీ వర్తించదని సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. మరి 8వ పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌లో రూల్స్ ఎందుకు మార్చారో చెప్పాలి. అసలు ఈ వ్యాలిడేషన్ యాక్ట్‌ను ఎందుకు తెచ్చినట్టు? దీనిపై మాకు అనేక అనుమానాలున్నాయి. చట్టాన్ని రద్దుచేసే దాకా పోరాడుతాం.
– సుధాకర్, స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ ఆలిండియా సెక్రటరీ జనరల్
భవిష్యత్తుకు ముప్పు
పెన్షన్ వ్యాలిడేషన్ యాక్ట్‌తో రిటైర్డ్ ఉద్యోగుల భవిష్యత్తుకు ముప్పు పొంచి ఉన్నది. పెన్షనర్స్ నియమావళి-1997లో మార్పులు తీసుకురావడంతో ఆర్థిక ప్రయోజనాలకు గండిపడనున్నది. ఇది దేశవ్యాప్తంగా కోటి మంది పెన్షనర్ల పాలిట శాపం లాంటింది. పెన్షనర్లకు నష్టం కలిగించే ఈ చట్టాన్ని రద్దు చేయాల్సిందే. సుప్రీంకోర్టులో వేసిన కేసులో మేం కూడా ఇంప్లీడ్ అయ్యాం. న్యాయపరంగా పోరాడుతాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని వ్యతిరేకించాలి. – కే లక్ష్మయ్య, పెన్షనర్స్ జేఏసీ చైర్మన్
ప్రధాన డిమాండ్లు