మన భగీరథపై కేంద్రం కట్టుకథ.. అంతా మాదేనంటూ తప్పుడు ప్రచారం
‘బీజేపోళ్లు మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలని ముద్దాడుతరు’ అని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ పదే పదే నిజం చేస్తున్నది. తాజాగా మరోసారి ఇలాంటి పనే చేసింది. ‘మిషన్ భగీరథ’ విజయాన్ని తన ఖాతాలో వేసుకొనేందుకు కుట్ర చేసింది.
- 54 లక్షల నల్లా కనెక్షన్లు ఇచ్చామని ట్వీట్
- మంత్రి హరీశ్ ఆగ్రహం
- నీతి ఆయోగ్ నిధులు ఇవ్వాలని చెప్పినా పైసా ఇవ్వలేదని ధ్వజం
హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): ‘బీజేపోళ్లు మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలని ముద్దాడుతరు’ అని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ పదే పదే నిజం చేస్తున్నది. తాజాగా మరోసారి ఇలాంటి పనే చేసింది. ‘మిషన్ భగీరథ’ విజయాన్ని తన ఖాతాలో వేసుకొనేందుకు కుట్ర చేసింది. ‘తెలంగాణ రాష్ట్రంలోని 54 లక్షలకుపైగా కుటుంబాలకు జల్ జీవన్ మిషన్ కింద నల్లా కనెక్షన్లు ఇచ్చాం. రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తుపై నమ్మకం కల్పించాం’ అని కేంద్ర జల్‌శక్తి శాఖ శనివారం ట్వీట్ చేసింది.
ఈ ట్వీట్‌పై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా మండిపడ్డారు. ‘మేం పనులు చేస్తే.. మీరు ప్రచారం చేసుకొంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు, మేధావులు కూడా కేంద్రంపై మండిపడుతున్నారు. తాగునీటి కోసం తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలను ఉద్యమ సమయంలోనే చూసి కేసీఆర్ చలించిపోయారని, ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించి, సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి న వెంటనే మిషన్ భగీరథకు శ్రీకారం చుట్టారని గుర్తు చేస్తున్నారు. మిషన్ భగీరథను రాష్ట్ర ప్రభుత్వం 46వేల కోట్లతో పూర్తి చేసింది. దీనికి ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదు. కేంద్ర మంత్రులు, అధికారులు వచ్చి ప్రశంసలు కురిపించారు తప్ప పైసాఇవ్వలేదు. నీతి ఆయోగ్ బృందం వచ్చి, ప్రశంసించి, 19వేల కోట్లు ఇవ్వాలని సూచించినా, కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదన్నది వాస్తవం కాదా? అని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు.
కేంద్రానికే ఆదర్శంగా మన పథకం
- రాష్ట్ర ప్రభుత్వం 2016లో మిషన్ భగీరథకు శ్రీకారం చుట్టింది. 2019 నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ నల్లా కనెక్షన్లు అందించింది. నాటి నుంచి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ సురక్షితమైన తాగునీటిని సరఫరా చేస్తున్నది.
- మిషన్ భగీరథ స్ఫూర్తితోనే కేంద్రం ‘హర్ ఘర్ జల్’ పేరుతో దేశవ్యాప్తంగా ఇంటింటికీ నల్లానీరు అందించే కార్యక్రమానికి 2019 ఆగస్టు 15న శ్రీకారం చుట్టింది. దీనిని జల్ జీవన్ మిషన్‌గా మార్చింది. 2024 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించుకొన్నది. ఇప్పటివరకు 42 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి.
- జల్ జీవన్ మిషన్ ప్రారంభించడానికి ముందే పూర్తయిన పథకాన్ని కేంద్రం ఎలా తన ఖాతాలో వేసుకొంటుందని తెలంగాణ ప్రజలు మోదీ సర్కారును నిలదీస్తున్నారు.
పనులు మావి.. ప్రచారం మీది?
మిషన్ భగీరథకు రూ.19 వేల కోట్లు ఇవ్వాలన్న నీతి ఆయోగ్ సిఫారసులను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం ఇవ్వాళ తామే మొత్తం ప్రాజెక్టును పూర్తి చేశామని చూపుకోవడం సిగ్గుచేటు. ఒక్క పైసా కూడా తెలంగాణ పథకాలకు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వమే ఇలా అబద్ధపు ప్రచారాన్ని కొనసాగించడం దిగజారుడుతనమే. మంది పిల్లల్ని మా పిల్లలు అని చెప్పుకుంటున్నరని సీఎం కేసీఆర్ అన్న సంగతిని ఈ ట్వీట్‌తో కేంద్రం మరోసారి నిజం చేసింది.
-మంత్రి హరీశ్‌రావు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

