హైదరాబాద్, ఫిబ్రవరి 6(నమస్తే తెలంగాణ): ‘రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక పెట్టుబడి సాయం 2024-2025 పథకం’ నిర్వహణలో కీలకమైన మైల్స్టోన్ సాధించినందుకు రాష్ట్రానికి జా తీయ రోడ్డు రవాణాశాఖ రూ.176.5 కోట్ల అదనపు ప్రోత్సాహక సాయం అందించింది. మైల్స్టోన్-1లో భాగం గా రూ.125 కోట్లు, మైల్స్టోన్-2లో భాగంగా రూ.51.5 కోట్లు పొందేందుకు రాష్ట్రం అర్హత సాధించింది.
వా హనపన్నులో రాయితీ ఇచ్చినందుకు రూ.50 కోట్లు, 15 ఏండ్ల పైబడిన వాహనాలను స్క్రాప్ చేస్తున్నందుకు రూ.75 కోట్లు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 21 జిల్లాలను ప్రియారిటీగా తీసుకున్నందుకు రూ.31.5 కోట్లు, ప్రాధాన్యత లేని జిల్లాల కోసం రూ.20 కోట్లు కలిపి మొత్తం రూ. 176.5 కోట్లు పొందేందుకు అర్హత సాధించినట్టు కేంద్ర రోడ్డు రవాణాశాఖ తెలిపింది.