Central Team | వరద ప్రభావ ప్రాంతాలను పరిశీలించిన కేంద్ర బృందం
Central Team | భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలను కేంద్రబృందం(Central Team) బుధవారం సందర్శించింది.
ములుగు : భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలను కేంద్రబృందం (Central Team) బుధవారం సందర్శించింది. ఏడుగురు సభ్యులు గల కేంద్ర బృందంలో ఎన్డీఎంఏ జాయింట్ సెక్రెటరీ కునాల్ సత్యార్థి (టీం లీడర్), డిప్యూటీ సెక్రటరీ అనిల్ గైరోల, రీజినల్ ఆఫీసర్ కుష్వా, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి డైరెక్టర్ రమేష్ కుమార్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ పూను స్వామి, హైదరాబాద్ ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ శ్రీనివాసులు, పవర్ భవ్య పాండే తదితరులున్నారు.
ఈ సందర్భంగా ములుగు (Mulugu ) జిల్లాలో నీట మునిగిన పంటలు, దెబ్బతిన్న చెరువులు, రోడ్లు, నష్టం వివరాలను జిల్లా ఇన్చార్జి ప్రత్యేక అధికారి యస్. క్రిష్ణ ఆదిత్య, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వారికి వివరించారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వరదల కారణంగా దెబ్బతిన్న, నష్టపోయిన వివరాలను కేంద్ర బృందానికి వీడియో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
జూలై 18 నుంచి 28 వరకు జిల్లాలో కురిసిన వర్షాలు ( Rains ), పంటల (Crops) వారీగా నష్టం వివరాలను తెలిపారు. వరదల వల్ల 54 గ్రామాలు, 27 లోతట్టు ప్రాంతాలు తీవ్రంగా నష్ట పోయాయని వివరించారు. వరదలు (Floods) వల్ల 17 మంది ప్రాణాలు కోల్పోయ్యారని తెలిపారు. 642 జంతువులు చనిపోయాయని పేర్కొన్నారు. దెబ్బతిన్న చెరువులు (Tanks) , కెనాల్స్ (Canals) , బ్రిడ్జిలు, రోడ్లు, కూలిపోయిన ఇండ్లు, విద్యుత్ స్తంభాల వివరాలను కేంద్ర బృంద సభ్యులకు కలెక్టర్ వివరించారు.
జిల్లాలో 49 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 5,861 మందికి ఆశ్రయం కల్పించినట్లు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యు టీములు పనిచేశాయని అన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ గౌస్ ఆలం, డీఎఫ్‌వో రాహుల్ కిషన్ జదేవ్, ఆర్డీవో కే. సత్యపాల్ రెడ్డి, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో, ఈడీఎం దేవేందర్ పాల్గొన్నారు. అంతకుముందు కేంద్ర బృందం జయశంకర్ భూపాల జిల్లాలో పర్యటించింది .
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

