హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరాలను అరికట్టేందుకు ఐదేండ్లలో 5వేల మంది సైబర్ కమాండోలను సిద్ధం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. వివిధ రాష్ట్ర పోలీసు బలగాల నుంచి దాదాపు 350మందితో ప్రత్యేక వింగ్‌ను ఏర్పాటు చేశారు.
వీరికి తమిళనాడులోని తిరుచ్చి (ఐఐటీ)లో శిక్షణ ఇవ్వనున్నారు.శిక్షణకు వరంగల్ కమిషనరేట్‌లో డిప్యూటీ ఏవోగా విధులు నిర్వహిస్తున్న ఏ.ప్రశాంత్‌కుమార్ ఎంపికయ్యారు.