హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని 14 జిల్లాలో మాదక ద్రవ్యాల నివారణ కేంద్రాల ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ గురువారం ప్రకటన విడుదల చేసింది. ప్రైవేటు సంస్థల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ కేంద్ర సామాజిక న్యాయసాధికారతశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తులు సమర్పించడానికి ఈ నెల 30 వరకు గడువు విధించింది.
కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల్ల, సంగారెడ్డి, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్‌నగర్, గద్వాల, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తి, సూర్యాపేటలో సెంటర్లకు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొంది. పూర్తి వివరాలకు 040-24559048 నంబర్‌ను, ఆన్లైన్ దరఖాస్తుల కోసం https://grants-msje.gov.in/ngo. login పోర్టల్‌ను సంప్రదించాలని సూచించింది.