హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 29తో పదవీ కాలం ముగియనున్న ఐదు స్థానాలకు మార్చి 20న ఎన్నికలు నిర్వహించనున్నట్టు పేర్కొంది. మార్చి 24లోపు ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు సోమవారం ప్రకటించింది. ఎమ్మెల్సీలు మహమ్మద్ మహమూద్ అలీ, సత్యవతిరాథోడ్, శేరి సుభాష్‌రెడ్డి, యెగ్గే మల్లేశం, మీర్జా రియాజుల్ హసన్ ఎఫెండీ పదవీ కాలం మార్చి 29తో ముగియనున్నట్టు తెలిపింది. మరోవైపు ఏపీలోనూ ఐదు స్థానాలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్