హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి వికాస్‌రాజ్ అన్నారు. శనివారం బీఆర్కేఆర్ భవన్లో జిల్లా ఎన్నికల అధికారుల (డీఈవో)కు ఎన్నికల నిర్వహణపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణ రెండు రోజులపాటు కొనసాగనున్నది.
మ్యాపింగ్, శాంతిభద్రతల వ్యూహరచన, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ కోసం ఏరియా డామినేషన్ ప్లాన్ రూపకల్పన, క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల నిర్వహణ, మోడల్ కోడ్ అమలు, ఈవీఎంలు తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. జిల్లా ఎన్నికల అధికారుల సందేహాలను నివృత్తిచేశారు. కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ సీఈవో అరిజ్ అఫ్తాబ్, తెలంగాణ అడిషనల్ సీఈవో లోకేశ్‌కుమార్, జాతీయ స్థాయి మాస్టర్ ట్రైనర్లు జయందేవ్, శుక్లా పాల్గొన్నారు.