హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తేతెలంగాణ) : రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రీజినల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నాయకత్వ శిక్షణ, పరిశోధన, సిల్ డెవలప్మెంట్ ట్రెయినర్లకు శిక్షణనిచ్చే ఈ కేంద్రం వల్ల తెలంగాణకు ప్రయోజనం చేకూరుతుందని గురువారం హైటెక్ సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ముంబైలో ఏర్పాటు చేసిన తరహాలో రాష్ట్రానికి కూడా ఒక కేంద్రాన్ని కేటాయించాలని కోరారు.
సెమీకండక్టర్ల పరిశ్రమల విషయంలో కేంద్రం హైదరాబాద్‌ను విస్మరించిందని ఆరోపించారు. ఇకడ చిప్ తయారీ పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉందని గుర్తుచేశారు. సమావేశంలో తమిళనాడు ఐటీ మంత్రి పళనివేల్ పాల్గొన్నారు.