CDS | హైదరాబాద్, ఏప్రిల్13 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ పంచిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు దక్కకుండా, కేసీఆర్‌కు పేరు రాకుండా ఉండాలనే కాంగ్రెస్ సర్కార్ కుట్రకు మరో కేంద్రం దర్పణంగా నిలిచింది. కేసీఆర్ హయాంలో నిర్మించిన సీడీఎస్ (సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్) నూతన భవనాన్ని 16 నెలలైనా ప్రారంభించకుండా కాంగ్రెస్ ప్రభు త్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. దళితుల అభ్యున్నతికి బహుముఖ కృషిచేస్తున్న సీడీఎస్ (సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్) మరింత మెరుగైన పరిశోధనలకు వీలుగా, దళితుల సమగ్ర అభివృద్ధికి ఒక దిక్సూచిలా నిలిచేలా శాశ్వత భవనాన్ని నిర్మించాలని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాడే సంకల్పించారు. అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని బోరబండ మోతీనగర్‌లో సీడీఎస్ భవన నిర్మాణానికి 2016లోనే సీఎంగా కేసీఆర్ శ్రీకారం చుట్టారు. 1,499 చదరపు గజాల భూమిని, రూ.25 కోట్లను ఆ భవన నిర్మాణానికి కేసీఆర్ కేటాయించారు.
ప్రవేశ ద్వారం వద్ద 27 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుచేశారు. పారింగ్ కోసం 2 సెల్లార్లు, స్టిల్ ఫ్లోర్ పారింగ్/మల్టిపర్పస్ ఓపెన్ ఏరియాను కేటాయించారు. 2023 జనవరి నాటికే ఆరు అంతస్థుల్లో భవన నిర్మాణ పనులన్నీ పూర్తయ్యాయి. ఇప్పటికి 16 నెలలు గడిచినా భవన ప్రారంభంపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి సారించడమే లేదు. తెలంగాణతోపాటు దేశమంతటా దళితుల సాధికారత కోసం అంకితభావంతో, రాజీలేకుండా సీడీఎస్ సంస్థ చేస్తున్న కృషికి గుర్తింపుగా దీనిని నిర్మించారు. దళితులపై అధ్యయనానికి అత్యంత భారీ మౌలిక సదుపాయాలు కలిగిన భవనం దేశంలో ఇదే మొదటిది కావడం తెలంగాణకు గర్వకారణం. దళిత వర్గాలకు సమాన హకులు కల్పించి, వారి నైపుణ్యాలు, సామర్థ్యాలను పెంపొందించడం ద్వారా ‘సమిష్టి సమాజాన్ని’ నిర్మించాలనే లక్ష్యంతో 1999లో లాభాపేక్షలేని సంస్థగా సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ (సీడీఎస్) ఏర్పడింది.
సామాజిక, ఆర్థిక అడ్డంకులను అధిగమిస్తూ సీడీఎస్ గత 23 ఏండ్లుగా సెమినార్లు, వర్షాప్లు, సమావేశాలు, డాక్యుమెంటరీ చిత్రాలు, మీడియా సెన్సిటైజేషన్, శిక్షణ, కెపాసిటీ బిల్డింగ్, అడ్వకేసీ, లాబీయింగ్‌తో సహా పలు వ్యూహాల ద్వారా దళితవర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత కోసం ప్రయత్నిస్తున్నది. సీడీఎస్ తన ప్రయాణంలో అనేక విజయాలు సాధించింది. అందులో ముఖ్యమైనది, ఎంతో చారిత్రత్మకమైనది ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం-2013. ఈ చట్టం కోసం 13 ఏండ్ల సుదీర్ఘ పోరాటానికి సీడీఎస్ నాయకత్వం వహించింది. అందులో టీఆర్ఎస్, నాటి ఉద్యమ నాయకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ చట్టంలో కీలక పాత్ర పోషించడం విశేషం. తెలంగాణ ఏర్పా టు తర్వాత ఆ చట్టాన్ని మెరుగైన అమలు కో సం 2017లో ‘షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టంగా కేసీఆర్ నాడు మార్చారు. కొత్త చట్టం, నియమాలను అమలు చేయడంలో సీడీఎస్‌ను ఒక భాగం చేయడం మరో విశేషం.
కాంగ్రెస్ సర్కారు తీవ్ర జాప్యం
ఆరు అంతస్తుల్లో చేపట్టిన సీడీఎస్ భవన నిర్మాణం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయింది. నామమాత్రపు పనులు మాత్రమే అప్పటికి పెండింగ్‌లో ఉన్నాయి. భవనం ప్రారంభానికి సిద్ధంగా ఉన్నదని దళిత్ స్టడీ సెంటర్ అధికారులు వెల్లడించారు. స్టడీ సెంటర్ అభివృద్ధికి, నిర్వహణకు కొద్దిమొత్తంలో నిధులను కేటాయిస్తే సరిపోతుంది. భవనం అందుబాటులోకి వస్తే దళితుల సామాజిక జీవనానికి సంబంధించిన అంశాలపై పరిశోధనలు, అధ్యయనాలకు, దళితులకు శిక్షణ కేంద్రంగా కూడా దోహదపడనున్నది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచినా ఇప్పటికీ ఈ భవనం ప్రారంభోత్సవంపై దృష్టి సారంచనేలేదు.
సీడీఎస్ కార్యకలాపాలు
ఆరు అంతస్థుల్లో సీడీఎస్ భవనం