హైదరాబాద్, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ ) : మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్రప్రభుత్వం దృష్టిసారించింది. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు భేటీ కానున్నారు. రైతులకు మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా మద్దతు ధర కల్పించే విషయంపై చర్చించనున్నారు. ఏపీ ప్రభుత్వం రాసిన లేఖకు స్పందించిన కేంద్రం.. మిర్చిని ఎగుమతి చేసే మార్గాలపై చర్చించనున్నారు. అయితే ఏపీ రైతులతోపాటు తెలంగాణ రైతుల మిర్చి కూడా కేంద్రం కొనుగోలు చేస్తుందా.. లేదా అనే దానిపై స్పష్టత లేదు.