మెట్పల్లి మారుతీనగర్, డిసెంబర్ 25 : న్యూఢిల్లీలోని పార్లమెంటులో గురువారం జరిగిన మాజీ ప్రధాని వాజ్‌పేయి, పండిత్ మదన్మోహన్ మాలవీయ జయంతి వేడుకల్లో జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన మెదక్ జిల్లా జోగిపేట పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదివే గంటేడి వర్షిత పాల్గొన్నది.
మెట్పల్లి బాలికల ఉన్నత పాఠశాలలో చదివిన వర్షిత తోటి విద్యార్థిని విశ్వనాథ వాగ్దేవితో కలిసి ఉపాధ్యాయుడు సతీశ్‌కుమార్ సహకారంతో అగ్రికల్చర్ రిలేటెడ్ మల్టీపర్పస్ క్రాప్ ప్రొటెక్టర్ పరికరాన్ని తయారు చేసి నవంబర్ 26న భోపాల్‌లో జరిగిన జాతీయ స్థాయి సైన్స్‌ఫెయిర్‌లో ప్రదర్శించింది. దేశవ్యాప్తంగా 245 మంది విద్యార్థులు ఇందులో పోటీపడగా ఉత్తమ ప్రదర్శనలో 36 మంది ఎంపికయ్యారు. ఇందులో వర్షిత కూడా ఉన్నది.