Mobile thiefs | ఖైరతాబాద్, జూలై 30: హైదరాబాద్‌లో సెల్ఫోన్లను దొంగలించి, బంగ్లాదేశ్ తదితర దేశాల్లో విక్రయిస్తున్న అంతర్జాతీయ ముఠాను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఆ ముఠా నుంచి 15 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయినవారిలో వివిధ రాష్ర్టాలకు చెందిన ఆరుగురు వ్యక్తులతోపాటు వారితో చేతులు కలిపి, సెల్ఫోన్ల చోరీకి సహకరిస్తున్న కానిస్టేబుళ్లు సాయిరాం (సైఫాబాద్), పీ సోమన్న (గాంధీనగర్), హోంగార్డు కే అశోక్ (గాంధీనగర్) ఉన్నట్టు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ మంగళవారం వెల్లడించారు. ఆ ముఠా నాయకుడు రాహుల్ కుమార్ యాదవ్, మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్టు తెలిపారు. సెల్ఫోన్ల చోరీ కోసం ఈ ముఠా చిన్నారులను సైతం చేరదీసి శిక్షణ ఇచ్చిందని, హైదరాబాద్‌తోపాటు సూరత్, లక్నో, రాంచీ, బేలూర్, చెన్నై, వారణాసి, నాగ్‌పూర్, పాట్నా తదితర నగరాలకు ఈ నెట్వర్క్ విస్తరించిందని వివరించారు.
సెల్‌ఫోన్ దొంగతనాలు జరిగిన వెంటనే బాధితులు పోలీస్‌స్టేషన్‌లో లేదా www.ceir.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని డీసీపీ విజయ్‌కుమార్ సూచించారు. ఇలాంటి ఫిర్యాదుల స్వీకరణలో అలసత్వాన్ని ప్రదర్శిస్తే చర్యలుంటాయని హెచ్చరించారు.
ఫోన్ల ట్యాపింగ్ కేసు దర్యాప్తును వేగవంతం చేశామని డీసీపీ విజయ్‌కుమార్ తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేశామని, త్వరలో మరికొందరిని అరెస్టు చేస్తామని చెప్పారు. ఈ కేసులో ప్రధా న నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టీ ప్రభాకర్‌రావుతోపాటు మరో నిందితుడైన ఓ మీడియా సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ శ్రావణ్‌కుమార్‌ను విదేశాల నుంచి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని, నిందితులెవరైనా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.
హైదరాబాద్, జూలై30 (నమస్తే తెలంగాణ): గురుకుల విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు బాట లు వేస్తున్నామని మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకులు విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు తెలిపారు. మియాపూర్‌లోని ఎంజేపీ పాఠశాలలో ‘మైండ్ స్పార్ ల్యాబ్’ను మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కాగ్నిజెంట్ ఫౌండేషన్, ఈఐ సహకారంతో దీనిని చేపట్టారు.