పరీక్ష కేంద్రంలోకి సెల్ఫోన్
పోటీ పరీక్షల నిర్వహణలో అధికారులు ఎన్ని క ఠిన నిబంధనలు తెచ్చినా.. ఎక్కడోచోట వ్యవస్థలోని లోపాలను ఆసరా గా చేసుకుని అక్రమాలకు పాల్పడుతూనే ఉన్నారు.
- కోర్టు ఉద్యోగ పరీక్షల్లో ఓ అభ్యర్థి నిర్వాకం
- విచారణ చేపట్టిన అధికారులు
తిమ్మాపూర్, జూన్ 25 : పోటీ పరీక్షల నిర్వహణలో అధికారులు ఎన్ని క ఠిన నిబంధనలు తెచ్చినా.. ఎక్కడోచోట వ్యవస్థలోని లోపాలను ఆసరా గా చేసుకుని అక్రమాలకు పాల్పడుతూనే ఉన్నారు. కోర్టు ఉద్యోగం రా సేందుకు ఓ అభ్యర్థి దర్జాగా ఏకంగా సెల్ ఫోన్నే తీసుకెళ్లాడు. ఇన్విజిలేటర్ గుర్తించడంతో పరీక్షకే దూరమయ్యా డు. పరీక్ష నిర్వహించిన టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీస్) సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. కోర్టుల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో పరీక్ష రాసేందు కు ఎల్ఎండీకాలనీలో గల శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో సెంటర్ ఏర్పాటు చేశారు.
ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పరీక్షకు కోర్టులో ఔట్సోర్సింగ్ విభాగంలో పనిచేసే సిద్దిపేటకు చెందిన అభ్యర్థి విజయ్ కేంద్రం లోపలకు అండర్వేర్లో సెల్ఫోన్ పెట్టుకుని తీసుకెళ్లాడు. పరీక్ష చివరి కొద్ది నిమిషాలు ఉందనగా విజయ్వద్ద ఫోన్ సౌండ్ వినిపించడంతో అలర్ట్ అయిన ఇన్విజిలేటర్.. ఫోన్లో ఆన్సర్స్ చూస్తున్నాడని గమనించి అతడిని పట్టుకున్నారు. అధికారులు ఫోన్ డాటా మొత్తం పరిశీలించారు. ప్రశ్నలు ఎవరికైనా పంపాడా?, ఎన్ని సమాధానాలు ఫోన్లో నుంచి రా శాడు? అని విచారించారు. హాల్లోకి ఫోన్ ఎలా వెళ్లిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- cellphones
- exam center
- tcs
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

