సినీఫక్కీలో సెల్ఫోన్ల చోరీ.. ఖమ్మం సోనోవిజన్లో ఘటన
సినీఫక్కీలో ఓ సెల్‌ఫోన్ దుకాణంలో రూ.67లక్షల విలువైన ఫోన్లను దుండగులు ఎత్తుకెళారు. పో లీసులు తెలిపిన ప్రకారం.. ఖమ్మం వైరా రోడ్డులోని సోనోవిజన్ షాపును బుధవా రం సాయంత్రం యజమాని మూసి వెళ్లాడు.
- రూ.67 లక్షల విలువైన 167 మొబైల్స్ ఎత్తుకెళ్లిన దొంగలు
మామిళ్లగూడెం, జూన్ 11: సినీఫక్కీలో ఓ సెల్‌ఫోన్ దుకాణంలో రూ.67లక్షల విలువైన ఫోన్లను దుండగులు ఎత్తుకెళారు. పో లీసులు తెలిపిన ప్రకారం.. ఖమ్మం వైరా రోడ్డులోని సోనోవిజన్ షాపును బుధవా రం సాయంత్రం యజమాని మూసి వెళ్లా డు. అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు షట్టర్ తాళాలను పగులగొట్టి చోరీకి పాల్పడుతున్న క్రమంలో స్టోర్ మేనేజర్‌కు అలర్ట్ మెసేజ్ వెళ్లింంది. అందుబాటులో ఉన్న ఉ ద్యోగులకు సమాచారం ఇచ్చి స్టోర్‌కు పంపగా, అప్పటికే షాపులోని 167 సెల్ఫోన్లను దుండగులు అపహరించారు.
ఆ సమయంలో ఓ ఉద్యోగి స్టోర్ వద్దకు వచ్చి నిందితుల కారుకు తన బైకుతో అడ్డుకొనే ప్రయత్నం చేయగా, వారు తప్పించుకు న్నారు. చోరీలో నలుగురు పాల్గొన్నట్టు షాప్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డు దృశ్యాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. స్టోర్‌కు కొత్త స్టాక్ వచ్చిన మరుసటి రోజే చోరీ జ రుగడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. స్టోర్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఖమ్మం వన్‌టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. ఘటన స్థలాన్ని ఖమ్మం సీపీ సునీల్‌దత్ పరిశీలించి, నిందితుల కోసం బృందాలు ఏర్పాటుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonam Wangchuk | నాయకులను రేపటిలోగా విడుదల చేయకపోతే.. నిరాహార దీక్ష చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్
SA vs AUS | రెన్షా ‘తొలి డబుల్’ చేజారే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్..!
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

