చేవెళ్లటౌన్, మే 8: సెల్‌ఫోన్ (Cellphone) డ్రైవింగ్ ప్రమాదకరమని తెలిసిన చాలమంది వాహనదారులు పట్టించుకోవడం లేదు. ప్రతి నిత్యం కార్లు, ద్విచక్రవాహనాలు నడుపుతూ సెల్‌ఫోన్ మాట్లాడటం మనం చూస్తునే ఉన్నాం. మరికొందరు ఇయర్ఫోన్లలో మ్యూజిక్ వింటూ వాహనాలు నడుపుతున్నారు. ఇలా ఫోన్లు మాట్లాడుతూ వాహనాలు నడిపి వారు ప్రమాదాలను కొని తెచ్చుకోవడమే కాకుండా ఎదుటి వారి ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారు. సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తూ రోడ్డుపై దృష్టి కేంద్రించకుండా ప్రమాదాలకు కారణమవుతున్నారు. అలాగే మ్యూజిక్ వింటూ అతివేగంగా వాహనాలను నడుపుతూ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు.
ముఖ్యంగా యువకులు చెవిలో ఇయర్స్ఫోన్ పెట్టుకుని రోడ్డుపై వాహనాలు నడుపుతూ వెనుక వచ్చే వాహనాలను పట్టించుకోవడం లేదు. అలాగే పాదచారులు సైతం ఇయర్స్ఫోన్ పెట్టుకుని వెళ్లుతూ వెనుక ముందు నుంచి వచ్చే వాహనాలను గమనించకుండ వెళ్తూ ప్రమాదాల బారినపడుతున్నారు. మరి కొందరూ ద్విచక్రవాహనాదారులు తలకు హెల్మెట్ ధరించి అందులో సెల్ఫోన్లు పెట్టి మాట్లాడుతూ వేగంగా వెళ్లుతున్నారు. ఫోన్ వచ్చినప్పుడు వాహనాన్ని పక్కన నిలిచి మాట్లాడాలి, కాని మీరు ఏ మాత్రం పట్టించుకోకుండ వాహనాలను పడుపుతూ ప్రమాదా బారిన పడి నిండు ప్రాణాలను కోల్పోతున్నారు. ఇటీవల వాహదారులు సెల్‌ఫోన్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి.మనలో చాలమంది డ్రైవింగ్ చూస్తూ సెల్‌ఫోన్ మాట్లాడటం తప్పుకాదని అనుకుంటున్నారు.కాని ఈ విధంగా డ్రైవ్ చేస్తూ వాహనదారులు ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు.సెల్‌ఫోన్ డ్రైవింగ్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేసి , జరీమానాలు విధించిన వాహనదారుల్లో మార్పు రావడం లేదు.
డ్రైవింగ్ చేస్తూ, రోడ్డు దాటేప్పుడు ఫోన్లో మాట్లాడ కూడదు..
డ్రైవింగ్ చేస్తు వాహనదారులు, పాదచారులు రోడ్డు దాటుతునప్పుడు సెల్‌ఫోన్‌ను ఉపయోగించొద్దని చేవెళ్ల డివిజన్ ట్రాఫీక్ సీఐ వెంకటేశం సూచించారు. సెల్‌ఫోన్ మన అవసరానికి వాడాలి కాని దాని మూలంగా ప్రమాదాలకు గురై మన ప్రాణాలు పోగోటుకోవద్దు. వాహనం నడుపుతున్నప్పుడు సెల్‌ఫోన్ వస్తే మన వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి మాట్లాడాలి, లేదా కాల్‌బ్యాక్ చేస్తే సరిపోతుంది. చాలా మంది ద్విచక్ర వాహనాలు, పాదచారులు రోడ్డు పై నడుస్తూ పోన్ మాట్లాడుతూ రోడ్డు దాటుతూ ఉంటారు. దీంతోపాటు చాలామంది మెడవంచి చెవికి, భుజానికి మధ్యన సెల్‌ఫోన్ పెట్టి మాట్లాడుతూ వాహనాలు డ్రైవ్ చేయడం వల్ల ఏకాగ్రత కోల్పోయి ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు పూర్తి ఫోకస్ రోడ్డుపై ఉండాలి అప్పుడే ఎటువంటి ప్రమాదాలు జరగవు. ప్రమాదాలు జరగకుండా వాహనదారులకు అవగాహన కూడా కల్పిస్తున్నాం.
సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్చేయడం ప్రాణానికి ప్రమాదం..
సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు డ్రైవ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోగోట్టుకుని కుటుంబాన్ని రోడ్డున పడేయొద్దని చేవెళ్ల పట్టణానికి చెందిన శంకర్‌గౌడ్ అన్నారు. వాహనాలు నడిపేటప్పుడు తమ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని నడిపితే ప్రమాదల నుంచి తప్పించుని గమ్యాని చేరుకుంటారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడటం, చాటింగ్, సెల్ఫీలు తీసుకోవడం వంటి పనులు చేయకూడదు. ఇలాంటివారిని పోలీసులు కఠినంగా శిక్షించాలి.