Bonala Jathara | హైదరాబాద్/ సిటీబ్యూరో, జూలై 16 (నమస్తే తెలంగాణ): డప్పు చప్పుళ్లు.. శివసత్తుల పూనకాలు.. పోతరాజుల నృత్యా లు.. ఘటాల ఊరేగింపుతో భాగ్యనగరం శిగమూగింది. పాతబస్తీలోని లాల్‌దర్వాజ, అక్కన్న మాదన్న, సబ్జిమండి, మీరాలం మండి, చార్మినార్ భాగ్యలక్ష్మి, ఉప్పుగూడ మహంకాళి, భరతమాత, హరిబౌలి, బం గారు మైసమ్మ, నాంపల్లిలోని ఏడు గుళ్లు, గౌలిగూడ, కార్వాన్ దర్బార్ మైసమ్మ ఆలయాల్లో ఆదివారం అంగరంగ వైభవంగా బోనాల వేడుకలు జరిగాయి. తెలంగాణ సాంప్రదాయానికి అద్దంపట్టే బోనాల జాతరతో నగరమంతా ఆధ్యాత్మికత ఉట్టిపడింది. బోనాల పాటలతో హోరెత్తింది. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, దేవాదా య శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పాతనగరంలోని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొనేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. తెలంగాణ పోలీస్, షీ టీమ్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. బోనాలు సమర్పించేందుకు మహిళా భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. రెండో రోజైన సోమవారం (నేడు) రంగం కార్యక్రమం ఉంటుందని ఆలయ పాలకమండలి తెలిపింది. గోల్కొండలో మొదటి బోనంతో ప్రారంభమైన ఆషాఢ బోనాల జాతర నేటితో ముగియనున్నది.
టీ హబ్‌లో ఘనంగా బోనాలు
టీ హబ్‌లో బోనాల పండుగను ఘనం గా నిర్వహించారు. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) ఆధ్వర్యంలో నిర్వహించిన పండుగలో కెనడా కార్మికశాఖ మంత్రి దీపక్ ఆనంద్, ఆయన సతీమణి అరుణా దీపక్ పాల్గొన్నారు. వేడుకలో టీటా అధ్యక్షుడు సందీప్‌కుమార్ మక్తల, ఐటీ ఉద్యోగులు పాల్గొన్నారు.
34
న్యూజిలాండ్‌లో బోనాల పండుగ
న్యూజిలాండ్ తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాపకుర గణేశ్ ఆల య ప్రాంగణంలో బోనాల పండుగ ఘనం గా నిర్వహించారు. వేడుకలో న్యూజిలాండ్ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్, ఎంపీ హె లెన్ వైట్, అసోసియేషన్ వ్యవస్థాపకుడు కల్యాణ్ రావు, కాసుగంటి మార్గదర్శకత్వంలో, కోర్ సభ్యులు రామ్మోహన్ దంతాల, స్వాతి పయ్యరకాయ, కిరణ్ పోకల, లక్ష్మణ్ కలకుంట్ల, అశుతో
శ్ తదితరులు పాల్గొన్నారు.