ఖమ్మం : ఖమ్మం ఐటీ హబ్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు పట్టణలోని ఐటీ హబ్లో ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా 2021 సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో బెస్ట్ పెర్ఫామెన్స్ అవార్డ్స్ తో పాటు పురుషులు, మహిళా విభాగంలో నిర్వహించిన కబడ్డీ, బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, త్రోబాల్తో పాటు వివిధ క్రీడల్లో విజేతలైన టీంలకు బహుమతులు అందజేశారు.
అనంతరం Technogen కంపెనీ రూపొందించిన నూతన లోగో ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, మేయర్ పునుకొల్లు నీరజ, డిసిసిబి చైర్మన్ విజయ్, TASK CEO శ్రీకాంత్ సిన్హా, T-hub వైస్ ప్రెసిడెంట్ పన్నీర్ సెల్వం, ఐటీ హబ్ కో-ఆర్డినేటర్, టెక్నో జెన్ CEO ల్యాక్స్ చెపురి, వివిధ కంపెనీల సీఈవోలు, ఉద్యోగులు పాల్గొన్నారు.