హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : రెండ్రోజుల క్రితం ఎంఎంటీఎస్‌లో మహిళపై లైంగికదాడి యత్నం ఘటనతో రైల్వేశాఖ కళ్లు తెరిచింది. రైలు బోగీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. రైళ్లలో అదనపు భద్రత ఏర్పాట్ల అంశంపై మంగళవారం సికింద్రాబాద్‌లోని రైల్వే నిలయంలో ఎస్సీఆర్ జీఎం ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళా బోగీల్లో అదనపు భద్రత కోసం ఆర్పీఎఫ్ సిబ్బందిపాటు ప్రభుత్వ రైల్వే పోలీస్(జీఆర్పీ)వ్యవస్థను బలోపేతం చేయనున్నారు. ప్రతి బోగీని కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానం చేయనున్నారు.