హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని సగం పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు లేవని పోలీసు శాఖ ఇచ్చిన వివరణలో తేలిందని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి పో లీస్స్టేషన్లో సీసీలు ఉండాలని సుప్రీంకోర్టు తెలిపిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎన్ని పోలీస్స్టేషన్లలో సీసీ కెమెరాలు ఉన్నాయో తెలుసుకునేందుకు తాము ఆర్టీఐ ద్వారా సమాధానం కోరినట్టు చెప్పారు. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు రాష్ట్రంలోని 376 పోలీస్ స్టేషన్లలో మాత్రమే సీసీ కెమెరాలు ఉన్నాయని, 396 పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు లేవని తేలిందని వెల్లడించారు.