Amit Shah | ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో అమిత్ షాకు నిరసన సెగ తగిలింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన జన గర్జన సభకు విచ్చేసిన అమిత్ షా కాన్వాయ్‌ను ఆదిలాబాద్ సీసీఐ సాధన కమిటీ సభ్యులు అడ్డుకోబోతూ.. అమిత్ షా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సీసీఐ పునరుద్ధరణ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, సీసీఐ సాధన కమిటీ సభ్యులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.