కరీంనగర్ కమాన్‌చౌరస్తా, మే 14 : సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో అల్ఫోర్స్ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ సాధించారని ఆ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం కరీంనగర్‌లోని వావిలాలపల్లిలో గల అల్ఫోర్స్ టైనిటాట్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల విజయోత్సవసభలో ఆయన మాట్లాడారు. అల్ఫోర్స్ సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి ఫలితాల్లో వంద శాతం ఉతీర్ణత సాధించినట్టు చెప్పారు. 10వ తరగతి ఫలితాల్లో శ్రేయాష్రెడ్డి, జే చైత్ర 500 మారులకు 493 మారులు సాధించి 98.6%తో అగ్రస్థానంలో నిలిచారని ఆయన పేర్కొన్నారు.
ఏ అక్షయ 487, ఎం లక్ష్మిసంయుక్త 487, జీ సహస్ర, డీ రుత్విక్, జీ లాన్యశ్రీ 486, జే సరయు, టీ స్వరజ్ఞ 485 తదితరులు మంచి ఫలితాలు సాధించినట్టు చెప్పారు. 219 మంది విద్యార్థులకు 89 మంది విద్యార్థులు 90 శాతానికిపైగా మారులు సాధించినట్టు ఆయన వివరించారు. 12వ తరగతి ఫలితాల్లో ఎన్ హేమంత్ 483 మారులతో అగ్రస్థానంలో నిలవగా, సుబోద్దరి 476, సాయి మంజునాథ్‌రెడ్డి 476, లహరి 476, వీ శ్రీముఖి 472 మార్కులు తెచ్చుకున్నట్టు చెప్పారు. మొత్తం 12 మంది విద్యార్థులు 90 శాతానికిపైగా మారులు సాధించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.