హైదరాబాద్, మార్చి 28(నమస్తే తెలంగాణ): రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి సంబంధించినది ఆరోపణలున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్‌పై సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్టు సీఎం రేవంత్అసెంబ్లీలో ప్రకటించారు. 2014 జూన్ 2నుంచి ఇప్పటివరకు జరిగిన మైనింగ్ లీజులపైనా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో పు విచారణ నివేదికను సభలో ప్రవేశపెట్టి నిజానిజాలు నిగ్గుతేలుస్తానని హె చ్చరించారు. మంత్రి అక్రమాలను బీఆర్ఎస్ బయటపెట్టిందనే కోపంతో సీఎం రేవంత్ బీఆర్ఎస్ మాజీ మంత్రులపై మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. ఈ సందర్భంగా ఒక్కొక్కడి సంగతి చూస్తానంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రులను ఉద్దేశించి వ్యాఖ్యానించడం గమనార్హం. శనివారం రాఘవ కన్స్ట్రక్షన్స్ అవకతవకలపై అసెంబ్లీలో మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన ఆరోపణలపై సీఎం స్పందిం చి.. ఆ కంపెనీ తప్పు చేసినట్టు ఒప్పుకొన్నారు.
సదరు సంస్థకు నోటీసులు ఇచ్చి బకాయిలు తీసుకోవడమే కాకుండా అ నుమతులు కూడా పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించినట్టు తెలిపారు. పొంగులేటి కుటుంబానికో లేదా వారి బంధువులకు వ్యాపారాలుంటే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఏం సంబంధమని సీఎం ప్రశ్నించారు. ఏపీ, తెలంగాణలో ఏ రెడ్డిని తీసుకున్నా ఒక రెడ్డికి మరో రెడ్డికి దూరపు బంధుత్వమో, దగ్గ రి బంధుత్వమో ఉంటుందని సెలవిచ్చా రు. ఇలా మంత్రి కుటుంబానికి గల వ్యా పారాలతో సదరు మంత్రికి సంబంధం ఉండదంటూ సీఎం ప్రకటించడం గమనార్హం. అయితే వాస్తవ విషయం ఏమిటంటే రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీలోని రాఘవ పేరు స్వయంగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తండ్రి పేరు కావడం గమనార్హం. అదే విధంగా ఈ కంపెనీలో డైరెక్టర్లుగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తనయుడు హర్ష, సోదరుడు ప్రసాద్‌రెడ్డి, ఆయన భార్య సైతం డైరెక్టర్లుగా ఉండడం గమనార్హం. ఇలా కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్న కొడుకు, సోదరుడి దూరపు బంధువులు ఎలా అవుతారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.