ఖైరతాబాద్, సెప్టెంబర్ 16 : బీసీ సంక్షేమ సంఘం, బీసీ కులసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 25న సమగ్ర కులగణన, బీసీలకు 42శాతం రిజర్వేషన్ల పెంపు డిమాండ్‌తో మిలియన్ మార్చ్ తరహాలో హైదరాబాద్‌లో లక్షలాది మందితో ‘కులగణన మార్చ్’ నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీ కులసంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్ చారి, కన్వీనర్ బాలగాని బాలరాజుగౌడ్, వేముల వెంకటేశ్, మణిమంజరితో కలిసి కులగణన మార్చ్ పోస్టర్ ఆవిష్కరించారు. కులగణనపై కేంద్రంలో రా హుల్ గాంధీ ఓ మాట మాట్లాడుతుండగా, రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి అందుకు భి న్నంగా వ్యవహరిస్తుండడం కాంగ్రెస్ కుటిలనీతిని తెలియజేస్తుందని మండిపడ్డారు. కులగణనపై 48 గంటల్లోపు సీఎం స్పష్టమైన హా మీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంటికొకరు తరలిరావాలని పిలుపునిచ్చారు.