Caste Census | ‘మున్నూరు కాపులను మాయం చేస్తరా?.. కులగణన పేరుతో తప్పు లెక్కలు’
Caste Census | రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కులగణన నివేదికలో మున్నూరు కాపు జనాభాను 4%లోపు చూపించారంటూ తెలంగాణ మున్నూరు కాపు సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Caste Census | హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కులగణన నివేదికలో మున్నూరు కాపు జనాభాను 4%లోపు చూపించారంటూ తెలంగాణ మున్నూరు కాపు సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ గణాంకాలు యావత్ బీసీ సమాజాన్ని తప్పుదోవ పట్టించి, తమ హక్కులను కాలరాసేవిగా ఉన్నాయని విమర్శించింది.
సబ్బండ వృత్తి కులాల సమాజమైన తెలంగాణలో బీసీ కులాలను 46 శాతమే చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణనలో అన్యాయానికి గురైన సహచర బీసీ కులాలకు సంఘీభావం ప్రకటించారు. అర్ధరాత్రి విడుదల చేసిన నివేదిక వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు. మున్నూరు కాపుల ఉనికిని తగ్గించి చూపడాన్ని పద్ధతి ప్రకారం జరిగిన కుట్రగా అభివర్ణించారు. తక్షణమే దిద్దుబాటు చర్యలకు పూనుకోని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి తమ తడాఖా చూపిస్తామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా పలు డిమాండ్లను ప్రభుత్వం ఎదుట పెట్టిన నేతలు త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. సమావేశంలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు సర్దార్ పుటం పురుషోత్తం పటేల్, పెద్ది పెంటయ్య, రాష్ట్ర కార్యనిర్వాహక నేతలు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhaskar Rao | సింగరేణి లాభాల తగ్గుదలపై సమగ్ర నివేదిక విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
పంచాయతీ అధికారి పర్సంటేజీల దందా ?
Weight Loss Surgery | కౌమారదశలో ఉన్న వారికి బరువు తగ్గించే శస్త్ర చికిత్సలు అవసరమా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది..?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

