హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై బరాబర్ పోలీసు కేసు పెట్టాల్సిందేనని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు. ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తేల్చిచెప్పారు. అల్లు అర్జున్‌పై కేసు పెట్టిన ప్రభుత్వం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై ఎందుకు పెట్టడం లేదని జనం ప్రశ్నిస్తున్నారని రిపోర్టర్ పొన్నం దృష్టికి తీసుకెళ్లారు.
బీసీ కమిషన్‌తో భేటీ
రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులతో మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సెంట్రల్ ఓబీసీ లిస్టులో లేని 40కులాలను ఆ జాబితాలో చేర్చేలా కేంద్రానికి ప్రతిపాదన పంపాలని నిర్ణయించారు.