అంబులెన్స్‌లోనే కేసు విచారణ
కేసు కోర్టు విచారణలో భాగంగా అనారోగ్యంతో బాధపడుతూ అంబులెన్స్‌లో వ చ్చిన ఫిర్యాదుదారు వద్దకే వెళ్లి న్యాయ మూర్తి వాంగ్మూలం తీసుకున్నారు.
- కరీంనగర్ కోర్టు ఆవరణలో ఫిర్యాదుదారు వాంగ్మూలం తీసుకున్న న్యాయమూర్తి
కరీంనగర్ కోర్టుచౌరస్తా, ఫిబ్రవరి 6: కేసు కోర్టు విచారణలో భాగంగా అనారోగ్యంతో బాధపడుతూ అంబులెన్స్‌లో వ చ్చిన ఫిర్యాదుదారు వద్దకే వెళ్లి న్యాయ మూర్తి వాంగ్మూలం తీసుకున్నారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాకేంద్రంలో జరిగింది. చిగురుమామిడి మండలకేంద్రానికి చెందిన అనువోజు రాజేశ్వరికి ఇద్దరు కూతుళ్లు,కొడుకు.వారికిపెండ్లిండ్లు అ య్యాయి. భర్త చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తున్నది. రాజేశ్వరిని కొడుకు వెంకటేశ్వర్లు పట్టించుకోకపోవడంతో ఆర్డీవోకు ఫిర్యా దు చేసింది. నెలకు రూ.4వేల పోషణకు ఇవ్వాలని ఆర్డీవో వెంకటేశ్వర్లు తీర్పు ఇచ్చారు. కొడుకు డబ్బులు ఇవ్వకపోవడంతో ఆమె చిగురుమామిడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంకటేశ్వర్లుపై కేసు నమోదుచేశారు. కోర్టులో కేసు విచారణకు రాగా ఫిర్యాదుదారు సాక్ష్యం కోర్టు స్వీకరించాల్సి ఉంది. రాజేశ్వరి పక్షవాతంతో బాధపడుతూ లేవలేని స్థితిలో ఉండగా, అంబులెన్స్‌లో కోర్టుకు తీసుకువచ్చారు. రాజేశ్వరి వద్దకు న్యాయమూర్తి బానోత్ రాజేశ్వర్ వెళ్లి వాంగ్మూలాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీరస్వామి, న్యాయవాది వేణుగోపాల్ సమక్షంలో నమోదు చేశారు. రాజేశ్వరి తన కొడుకు వెంకటేశ్వర్లుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడం గమనార్హం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

