గార్ల, జనవరి 25 : మహబూబాబాద్ జిల్లా గార్ల మండల ‘నమస్తే తెలంగాణ’ రిపోర్టర్ సోమయ్యపై దాడిచేసిన ఇద్దరు కాంగ్రెస్ గూండాలపై ఆదివారం కేసు నమోదు అయింది. వివరాల్లోకి వెళ్తే.. రిపోర్టర్ సోమయ్యపై శనివారం కాంగ్రెస్ పార్టీకి చెందిన భూక్యా నాగేశ్వర్రావు, గులగట్టు లెనిన్ దాడి చేశారు. బాధితుడికి ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్సై సాయికుమార్ కేసు నమోదుచేశారు.
నమస్తే తెలంగాణ గార్ల మండల రిపోర్టర్ నరేడ్ల సోమయ్యపై శనివారం కాంగ్రెస్ గూండాలు దాడి చేసి గాయపర్చిన విషయం తెలుసుకున్న సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆదివారం సోమయ్యకు ఫోన్ చేసి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ గూండాల దాడి గల కారణాలు అడిగితెలుసుకొని, సోమయ్యకు ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని, దాడికి పాల్పడిన కాంగ్రెస్ గూండాలను వదిలి పెట్టమని చెప్పారు. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతిరాథోడ్, మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ సోమయ్యకు ఫోన్ చేసి పరామర్శించారు. కాంగ్రెస్ నాయకుల అరాచకాలను తిప్పికొడుదామని, ధైర్యంగా ఉండాలని సోమయ్యకు సూచించారు. మహబూబాబాద్ మాజీ జడ్పీచైర్‌పర్సన్ అంగోత్ బిందు, ఇల్లందు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ హరిసింగ్‌నాయక్ సోమయ్యను పరామర్శించారు.