శేరిలింగంపల్లి, జూన్ 24: సంధ్య కన్వెన్షన్ ఎండీ సరనాల శ్రీధర్‌రావుపై మరో కేసు నమోదైంది. రెహమత్‌నగర్‌కు చెందిన నర్సింహారెడ్డికి శ్రీధర్‌రావు ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించిన ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, బాధితుడు గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
కొద్దిరోజుల క్రితం గచ్చిబౌలిలోని ఫెర్టిలైజర్స్ కో ఆప్టివ్ హౌసింగ్ సొసైటీలో హైడ్రా అధికారులు సర్వే చేస్తుండగా దాడి చేశారని నటి రమ్మశ్రీ సోదరుడు ప్రశాంత్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, శ్రీధర్‌రావుతోపాటు మరికొందరిపై కేసు నమోదైంది.