భద్రాచలం, ఆగస్టు 28 : ఉద్యోగం ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలుచేసిన ఘటనలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఎమ్మెల్యే పీఏ కల్యాణ్‌పై పోలీసులు శుక్రవారం కేసు నమోదుచేశారు. భద్రాచలం డీఎస్పీ అరుణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే అనుచరుడు రాయల శ్రీను తన బంధువుకు ఉద్యోగం ఇప్పించాలని ఎమ్మెల్యే పీఏ కల్యాణ్‌ను ఆశ్రయించాడు.
ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించడంతో, రాయల శ్రీను రూ.9,95,000 కల్యాణ్‌కు చెల్లించాడు. కల్యాణ్ వారం రోజులుగా కనిపించకుండాపోవడంతో బాధితుడు మోసపోయానని గ్రహించి భద్రాచలం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కల్యాణ్‌పై కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్టు డీఎస్పీ తెలిపారు.