ఎదులాపురం, సెప్టెంబర్ 28: తమ ఇండ్లను కూల్చేస్తారేమోనన్న ఆందోళనలో పలువురు సీఎం రేవంత్‌ని దుర్భాషలాడినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. ఖానాపూర్ చెరువు సమీప గుడిసెల్లో నివాసముంటున్న వారి ఇండ్ల కొలతలు తీసుకుంటున్న అధికారులను శుక్రవారం కాలనీవాసులు అడ్డుకున్నారు.
తాము ఎన్నో ఏండ్లుగా గుడిసెలు వేసుకుని, ఇండ్లు కట్టుకుని జీవిస్తున్నామని పేర్కొన్నారు. హైడ్రా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం తాము కట్టుకున్న ఇండ్లను కూల్చేస్తుందన్న భయంతో ఆందోళనకు గురయ్యారు. దీంతో భావోద్వేగానికి గురైన కాలనీవాసులు కొందరు సీఎం రేవంత్‌రెడ్డిని దుర్భాషలాడారు. ఈ మేరకు గంగన్నతోపాటు మరికొందరిపై కేసులు నమోదు చేసినట్టు ఆదిలాబాద్ వన్‌టౌన్ ఎస్సై ఇసాక్ తెలిపారు.