బంజారాహిల్స్, మార్చి 30: కాంట్రాక్టర్లు, బిల్డర్ల నుంచి సీఎం రేవంత్‌రెడ్డి రూ.2,500 కోట్లు వసూలు చేశారంటూ వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై హనుమకొండకు చెందిన కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాస్‌రావు ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం రాత్రి కేటీఆర్‌పై ఐపీసీ 504, 505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.