పట్టణాల్లో జంతువులకు రక్షణ!

- ఇప్పటికే 13 జిల్లాల్లో ఏసీసీ ఏర్పాటు
- నెలాఖరులోగా మరో 14 చోట్ల..
- 16వేల వీధికుక్కలకు స్టెరిలైజేషన్
- మేనకాగాంధీతో సహా జంతు ప్రేమికుల ప్రశంసలు
హైదరాబాద్, అక్టోబరు 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నెలాఖరులోగా యానిమల్ కేర్ సెంటర్ (ఏసీసీ) నెలకొల్పేందుకు మున్సిపల్‌శాఖ ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే 13 జిల్లాల్లో వీటిని ఏర్పాటుచేయగా, మరో 14 జిల్లాల్లో ఏర్పాటుచేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటివరకు వరంగల్, మహబూబాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, సంగారెడ్డి, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేట, నిజామాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మాల్కాజిగిరి జిల్లాల్లో వీటిని నెలకొల్పారు. మిగిలినచోట్ల అనువైన స్థలాల కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. జంతువులకు ప్రాథమిక అవసరాలైన తిండి, శుభ్రత, భద్రతను కల్పించడమే లక్ష్యంగా వీటిని ఏర్పాటుచేస్తున్నారు. జంతు సంరక్షణ కేంద్రాల నిర్వహణకు అవసరమైన నిధులను మున్సిపాలిటీల ద్వారా కేటాయిస్తున్నారు. ఆయా కేంద్రాల్లో కోతులు, కుక్కలు, ఇతర జంతువులను ఉంచడానికి విడివిడిగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్టెరిలైజేషన్ థియేటర్‌తోపాటు సెక్యూరిటీ సిబ్బంది కోసం గదులు కేటాయిస్తున్నారు. జంతువులను వెటర్నరీ డాక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. కుక్కకాటు కారణంగా రేబిస్ వ్యాధి బారిన పడకుండా ప్రజలను కాపాడే లక్ష్యంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 15,938 వీధికుక్కలకు స్టెరిలైజేషన్ చేశారు. జంతు సంరక్షణ కేంద్రాల్లో కోతులు, కుక్కలు, ఇతర జంతువుల కోసం చేస్తున్న ఏర్పాట్లను పలువురు జంతుప్రేమికులు ప్రశంసిస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి, మేనకాగాంధీ కూడా ఇటీవల మంత్రి కేటీఆర్‌కు ఫోన్‌చేసి అభినందించడం విశేషం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

