Lok Sabha Elections | కారు గుర్తు కొట్టివేత.. గద్వాల జిల్లా పైపాడులో వివాదం
Lok Sabha Elections | లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడమే లక్ష్యంగా గుర్తు తెలియని దుండగులు ఈవీఎంలో కారు గుర్తును చెరిపేశారు. ఈ ఘటన గద్వాల జిల్లా పైపాడులో వెలుగు చూసింది.
Lok Sabha Elections | జోగులాంబ గద్వాల : లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడమే లక్ష్యంగా గుర్తు తెలియని దుండగులు ఈవీఎంలో కారు గుర్తును చెరిపేశారు. ఈ ఘటన గద్వాల జిల్లా పైపాడులో వెలుగు చూసింది.
వడ్డేపల్లి మండలం పైపాడులోని పోలింగ్ బూత్ నంబరు 167లో ఈవీఎంలో కారు గుర్తు కనిపించకుండా మార్కర్‌తో రుద్దడంతో వివాదం నెలకొంది. దంతో కొంత సమయం పాటు పోలింగ్ నిలిచిపోయింది. ఈ బూత్‌లో మొత్తం 1,196 ఓట్లు ఉండగా 848 ఓట్లు పోలైన తర్వాత వచ్చిన ఓటరు దీనిని గమనించి అధికారులకు తెలియజేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పోలింగ్ బూత్ వద్దకు వచ్చి సిబ్బందితో మాట్లాడి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.
జిల్లా ఎస్పీ రితిరాజ్ బూత్ వద్దకు వచ్చి పోలింగ్ అధికారి నర్సింహులుతో మాట్లాడారు. ఈవీఎం ప్యాడ్ పైన మర్కర్ను తుడవడంతో కారు గుర్తు మళ్లీ పూర్తిగా కనిపించింది. అనంతరం పోలింగ్ కొనసాగించారు. పోలింగ్ సక్రమంగా జరగలేదని, అవసరమైతే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS party
- Car symbol
- evm
- gadwal
RELATED ARTICLES
తాజా వార్తలు
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

