హైదరాబాద్: నగర శివార్లలోని పెద్ద అంబర్పేట వద్ద ఔటర్ రింగురోడ్డుపై (ORR) ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్పై వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ముందుగా వెళ్తున్న లారీని వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారు, లారీ దగ్ధమయ్యాయి. అయితే రెండు వాహనాల్లో డ్రైవర్లు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారులో ఉన్న వ్యక్తిని ఈసీఐఎల్ దమ్మాయిగూడాకు చెందిన మయూర్గా గుర్తించారు. ప్రమాద సంయంలో అతడు మద్యం మత్తులో ఉన్నాడని చెప్పారు.