నిజామాబాద్ : జిల్లాలోని వేల్పూరు మండల కేంద్రం శివారులో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. భీమ్‌గల్ నుంచి వేల్పూరు వెళ్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
మృతులను భీమ్‌గల్ మండలం పిప్రి గ్రామానికి చెందిన మనోజ్(24), బచన్పల్లి వాసి శ్రావణ్(25)గా పోలీసులు గుర్తించారు. గాయపడ్డ యువకుడు భరత్‌ను ఆర్మూర్‌లోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.