మర్రిగూడ, అక్టోబర్ 17: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపును ఆపడం ఎవరితరమూ కాదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని రాంరెడ్డిపల్లికి చెందిన పల్లేటి జంగయ్య, అంతంపేటకు చెందిన సుధాకర్‌నాయక్ ఇండిపెండెంట్‌గా వేసిన నామినేషన్లు ఉపసంహరించుకొని టీఆర్ఎస్ పార్టీకి జైకొట్టారు. సోమవారం వారికి మంత్రి జగదీశ్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. రూ.18 వేల కోట్లకు బీజేపీకి అమ్ముడు పోయిన నీచుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అని జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. అలాంటి వ్యక్తికి మునుగోడు నియోజకవర్గ ప్రజలు రాజకీయ సమాధి కట్టడం ఖాయమని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి, సహకార చైర్మన్ పందుల యాదయ్యగౌడ్, ఎంపీటీసీ నేనావత్ బంతిలాల్ పాల్గొన్నారు.
గొల్లకురుమలను ఆదుకున్నది కేసీఆరే
తెలంగాణ ప్రభుత్వం వచ్చినంకనే మా బతుకులు మారినయి. రాష్ట్రంలో ఉన్న గొల్లకురుమలను గుర్తించి ఉచిత గొర్రెల పంపిణీ చేపట్టి మా జీవితాల్లో వెలుగులు నింపింది సీఎం కేసీఆర్ సారే. మేం ఉన్నన్ని రోజులు కారు గుర్తుకే ఓటేస్తం. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించుకుంటం. మంత్రి కేటీఆర్‌ను చూసేందుకు మా ఊరి నుంచి వచ్చిన. సారు బ్రహ్మాండంగా మాట్లాడుతుండు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయితడు.
–దోటి లింగయ్య, రైతు,దొనిపాముల, మం: చండూరు