Group-4 | హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-4 ఉద్యోగాల భర్తీలో బ్యాక్లాగ్ పెట్టొద్దని అ భ్యర్థులు కోరుతున్నారు. 1:3 ప్రకారం సెలెక్ట్ అయిన వారికి అన్విల్లింగ్ ఇ వ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇ టీవల గురుకుల పోస్టుల భర్తీలో ఎదురైన ఇ బ్బందులను పరిగణలోకి తీసుకోవాలని విన్నవిస్తున్నారు. 2500 పోస్టులు బ్యాక్లాగ్ కావడంతో ఇప్పటికీ ఆందోళన చేస్తున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు.
జీవో 46 రద్దు విషయంలోనూ ప్రభుత్వం మాట తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు మొండివైఖరి వీడాలని, అవసరమైతే అభ్యర్థులతో చర్చించాలని కోరుతున్నారు. లేకుంటే గురుకుల అభ్యర్థుల తరహాలో పెద్దఎత్తున ఆం దోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.
గ్రూప్-4 ఉద్యోగాల భర్తీపై డిప్య్యూటీ సీఎం భట్టిని కలిసేందుకు వచ్చిన అభ్యర్థులకు తీవ్ర నిరాశ ఎదురైంది. అశోక్‌నగర్‌లో ఓ అకాడమీ ప్రారంభోత్సవానికి హాజరైన ఆయనను కలిసేందుకు వెళ్లిన నిరుద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు.