హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): కొందరు అభ్యర్థులు ఈ పోస్టుల భర్తీలో తమకు అన్యాయం జరిగిందంటూ హైకోర్టును ఆశ్రయించారు. టీజీపీఎస్సీ భర్తీ అయిన పోస్టుల్లో కొన్నింటిపై అభ్య ర్థులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు అభ్యర్థులు శుక్రవారం హైకోర్టు మెట్లెక్కారు. జోన్-1లోని అభ్యర్థికి జోన్-6లో ఉద్యోగమిచ్చారని, తక్కువ మార్కులొచ్చిన ఓ అభ్యర్థికి ఉద్యోగమిచ్చారని, మొదటి రోస్టర్ పాయింట్‌ను అన్‌రిజర్వుడ్‌కు కేటాయించాలని ఎక్కడా చెప్పలేదని వారు అభ్యంతరాలు వ్యక్తంచేశారు.