హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): ప్రేమ, వాత్సల్యంతో మనుమళ్లకు ఎలాంటి షరతులు విధించకుండా ఇచ్చిన గిఫ్ట్ డీడ్‌ను సీనియర్ సిటిజన్స్ చట్టం కింద రద్దు చేయడం చెల్లదని హైకోర్టు తీర్పు చె ప్పింది. ఒప్పందంలోని షరతులను ఉల్లంఘించినప్పుడే సీనియర్ సిటిజన్స్ చట్టంలోని సెక్షన్ 23(1) కింద గిఫ్ట్‌డీడ్‌ను రద్దు చేసుకునేందుకు వీలుంటుందని స్పష్టం చేసింది.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌లోని ఓ భవనంలో తనకు బహూకరిస్తూ ఇచ్చిన గిఫ్ట్ డీడ్‌ను తన తాత (తల్లి నాన్న) ఫిర్యాదు మేరకు ఆర్డీవో రద్దు చేయడంపై అమెరికాలోని రోహిత్ శౌర్య పిటిషన్ దాఖలు చేయడంతో హై కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.