Tirumala | హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తేతెలంగాణ) : వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో నెలకొన్న రద్దీ కారణంగా ఈ నెల 27, 28, 29 తేదీలకు సంబంధించి శ్రీవారి ఆఫ్‌లైన్ టికెట్ల జారీని టీటీడీ రద్దు చేసింది. అందులో భాగంగా తిరుమల శ్రీవారి దర్శన టికెట్లకౌంటర్, రేణిగుంట విమానాశ్రయంలో ఆఫ్‌లైన్ టికెట్ల జారీ ఉండదని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శన ప్రణాళికలను రూపొందించుకోవాలని వారు ఒక ప్రకటనలో కోరారు.
హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తేతెలంగాణ): తిరుమల భక్తులతో కిటకిటలాడుతున్నది. స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. క్రిస్మస్ సెలవులు, వారాంతం కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్దఎత్తున భక్తులు తరలివెళ్లడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని షెడ్లు పూర్తిగా నిండి శిలాతోరణం వరకు లైన్లలోనే బారులు తీరారు. శ్రీవారి ఆలయ పరిసరాలు, వస తి సముదాయాలు, ఆర్టీసీ బస్‌స్టాండ్ ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.