హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): మునుగోడు నియోజకవర్గానికి వివిధ యూనివర్సిటీల విద్యార్థులు తరలివెళ్లారు. తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శిస్తున్న ప్రధాని మోదీకి, బీజేపీకి తెలంగాణ ఆత్మగౌరవ తడా ఖా చూపించడమే లక్ష్యంగా ప్రచారం సాగిస్తున్నారు. ఉద్యమ ఆకాంక్షలు తీర్చిన సీఎం కేసీఆర్ పట్ల కృతజ్ఞతతో టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసేందుకు ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన వర్సిటీల విద్యార్థులు తరలివెళ్లారు.
స్వార్థ రాజకీయాల కోసం మునుగోడు ప్రజల ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టిన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నిజస్వరూపాన్ని ఊరూరా తిరుగుతూ ఎండగడుతున్నారు. రాష్ట్రంలో గతంలో జరిగిన ఉపఎన్నికలకు, మునుగోడు ఉపఎన్నికకు తేడాను వివరిస్తున్నారు. తెలంగాణ ప్రతిష్ఠను పెంచుతూ, ప్రజ ల జీవితాలను మార్చేందుకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు అండగా నిలబడాల్సిన అస రం ఉన్నదని విజ్ఞప్తి చేస్తున్నారు. మునుగోడు సమస్యలపై సీఎం కేసీఆర్‌కు స్థానిక ప్రజల పక్షాన నివేదిక ఇస్తామని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్తున్నారు.
మును‘గోడు’కు చలించిన విద్యార్థిలోకం
ఇప్పుడిప్పుడే కోలుకొంటున్న మునుగోడు ప్రజల గోడువిన్న విద్యార్థులు చలించిపోయా రు. ఫ్లోరైడ్ బారినపడిన వారిని ప్రత్యక్షంగా చూసి ఆవేదన చెందుతున్నారు. గతంలో నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్య ఉన్నట్టు తెలుసు కానీ, ఇంతలా ఊహించలేకపోయామని ఉస్మానియా విద్యార్థులు తల్లడిల్లిపోయారు.
కేంద్రం వివక్షపై ఊరూరా ప్రచారం
కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి చేస్తున్న అన్యాయాన్ని విద్యార్థులు ఊరూరా వివరిస్తున్నారు. రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసమే బీజేపీలో చేరానని ఒప్పుకొన్న రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యల వీడియోను అందరికీ చూపిస్తున్నారు. రాష్ట్రం లో కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేస్తుం టే.. కేంద్రంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా మోదీ భర్తీ చేయడంలేదని వివరిస్తున్నారు. విభజన చట్టం హామీలను నెరవేర్చకుండా మోదీ కక్ష కట్టినతీరును ఎండగడుతున్నారు. మర్రిగూడ మండలంలో 300 పడకల దవాఖానను నిర్మిస్తామని, నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్య పరిష్కారానికి రీసెర్చి సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని నమ్మబలికి అప్పటి కేంద్ర మంత్రి, ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మోసాన్ని వివరిస్తున్నారు.
గోడు తీర్చిన కేసీఆర్ వెంటే జనం
దీర్ఘకాలిక సమస్యను సీఎం కేసీఆర్ పరిష్కరించారనే కృతజ్ఞత ప్రజల్లో ఉన్నదని విద్యార్థులు చెప్పారు. శివన్నగూడెం ప్రాజెక్టు పూర్తతే తమ జీవితాల్లో శాశ్వత వెలుగు వస్తుందనే భావన స్థానికుల్లో కనిపిస్తున్నదని పేర్కొన్నా రు. ‘సద్ది తిన్నా రేవు తలిస్తే బుక్కెడు బువ్వ దొరుకది’ అని, కేసీఆర్ తమ కష్టాలను తీరుస్తున్నడు కనుక ఆయనకే అండగా ఉంటామని ప్రజలు చెప్తున్నారని వెల్లడించారు.
సమస్యలు తీర్చాలని సీఎంను కోరతాం
మునుగోడు సమస్యల పరిష్కారానికి తమవంతు ప్రయత్నం చేస్తామని విద్యార్థులు చెప్పారు. ఇక్కడి ప్రజలు తమ తాగునీటి హక్కును కేసీఆర్ తీర్చారనే విశ్వాసంతో ఉన్నా రు. శివన్నగూడెం, శెర్లగూడెం ప్రాజెక్టు, అంతర్గత రోడ్లు, మురికి కాల్వలు, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి రోడ్లు నిర్మించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. ప్రజల కోరికలపై సీఎం కేసీఆర్‌కు ఒక నివేదిక అందజేస్తామని రమేశ్, ముత్యాలు, జంగయ్య, మల్లేశ్, రవీందర్, రాజు, సూర్యకిరణ్ చెప్పారు.
మార్పులు చూస్తున్నం
2010లో తెలంగాణ ఉద్యమం కోసం గాదరి కిశోర్, దూదిమెట్ల బాలరాజు, పిడమర్తి రవి, కైలాశ్యాదవ్తో కలిసి 900 కిలోమీటర్ల పాదయాత్రను మునుగోడు మీదుగానే చేశాం. అప్పడు కలిసిన వారిని ఇప్పుడు మళ్లీ కలిస్తుంటే సంతోషంగా ఉన్నది. ‘కేసీఆర్ మా బతుకులు మార్చిండు బిడ్డా’ అంటున్నారు. ఇంకా చాలా మార్పులు జరగాల్సి ఉన్నది. ఆ మార్పులు కేసీఆర్‌తోనే సాధ్యమని చెప్తున్నారు.
-జున్ను రాజు, ఓయూ విద్యార్థి
బీజేపీకి గుణపాఠం చెప్తారు
తెలంగాణ అభివృద్ధికి సహకరించకపోగా రాష్ట్ర ఉనికినే ప్రశ్నార్థం చేస్తున్న బీజేపీకి గుణపాఠం చెప్పేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ ఏం చేసిండు అని అడిగితే.. ప్రజలే పాఠం చెప్తున్నారు. 24 గంటల విద్యుత్తు, కల్యాణలక్ష్మి ఇట్లా ప్రభుత్వ పథకాలు పొందినవారు, యువకులు రాజగోపాల్‌రెడ్డి పట్ల వ్యతిరేకతతో ఉన్నారు.
–పీ. రమేశ్, రిసెర్చ్ స్కాలర్, ఓయూ