హైదరాబాద్, అక్టోబర్ 23(నమస్తే తెలంగాణ): జపాన్‌లోని దవాఖానల్లో నర్సింగ్ ఉద్యోగుల నియామకానికి టామ్‌కామ్(తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్) దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 22-30 ఏండ్ల మధ్య వయసు, ఇంటర్మీడియట్‌తోపాటు జీఎన్ఎం డిప్లొమా/ఏఎన్ఎం, పారామెడికల్ అర్హతగలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన మొదటి 50మందికి హైదరాబాద్‌లో జపనీస్ భాషతోపాటు అక్కడ పనిచేసేందుకు అవసరమైన వృత్తి నైపుణ్యాలపై శిక్షణ ఇస్తారు. అనంతరం జపాన్‌లో ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. రిజిస్ట్రేషన్, ఇంటర్యూ తదితర వివరాలకు టామ్‌కామ్ వెబ్‌సైట్‌ను లేదా 9704570248/ 9573945684 నంబర్లను సంప్రదించవచ్చు.