Six Guarantees | ఆరు గ్యారెంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క
Six Guarantees | ఆరు గ్యారెంటీల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. సబ్ కమిటీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యవహరించనున్నారు.
Six Guarantees | ఆరు గ్యారెంటీల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. సబ్ కమిటీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యవహరించనున్నారు. ప్రజాపాలనపై సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆరు గ్యారెంటీల అమలుపై చర్చించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామిన కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో వాటి అమలు కోసం సబ్ కమిటీని వేసినట్లు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ తెలిపారు. నిజమైన లబ్ధిదారులకు అభయహస్తం పథకాలు అందిస్తామన్నారు. ఎన్నికల హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇదిలా ఉండగా.. డిసెంబర్ 28 నుంచి ఈ నెల 6 వరకు ప్రజాపాలనలో రాష్ట్రవ్యాప్తంగా 1,24,85,383 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఐదు పథకాల కోసం 1,05,91,636 దరఖాస్తులు రాగా, రేషన్ కార్డులు, తదితర అంశాలపై 19,92,747 దరఖాస్తులు వచ్చాయి. 16,392 పంచాయతీలు, 710 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన గ్రామసభలను జరిగాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

