హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే స్కీమ్‌లో చేరేందుకు మంత్రివర్గం అంగీకరించింది. తెలంగాణ డిస్కమ్‌ల ప్రతిపాదన మేరకు వ్యవసాయ విద్యుత్తు వినియోగానికి సంబంధించి మీటర్లు బిగించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్(ఆర్డీఎస్ఎస్)’లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు శనివారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్లో ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కేబినెట్ నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. విద్యుత్తు పంపిణీ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఆర్డీఎస్ఎస్లో చేరేందుకు తెలంగాణ డిసమ్లు చేసిన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని తెలిపారు. ఈ స్కీమ్‌లో భాగంగానే అయితే మోటర్లకా లేదా ఫీడర్లకా ఇలా ఎక్కడో ఒకచోట మీటర్లు పెట్టాల్సి వస్తుందనే అభిప్రాయాలున్నాయి. వాస్తవానికి ఆర్డీఎస్ఎస్ అనేదే మీటర్లు పెట్టేందుకు ఉద్దేశించింది. ఇందుకు రూ.1,300కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే గతంలో బీఆర్ఎస్ సర్కార్ రైతులకు నష్టం చేయొద్దనే ఆలోచనతో ఈ స్కీమ్‌లో చేరలేదు. ఇందుకో సం కేంద్రం ఆఫర్ చేసిన అదనపు రుణ సౌకర్యాన్ని సైతం నాటి ప్రభుత్వం వదులుకున్నది.