హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకంలో భాగంగా 70 ఏండ్లు దాటిన వయోవృద్ధులందరికీ రూ.5 లక్షల వరకు వైద్య బీమా అందించాలని కేంద్రం నిర్ణయించడం హర్షణీయమని కేంద్రమంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు.
ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ ‘వృద్ధుల సంక్షేమానికి ఓ కుటుంబ పెద్దగా, పెద్దకొడుకుగా ఆలోచించిన ప్రధాని మోదీ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ నుంచి దాదాపు 10 లక్షల మంది లబ్ధిపొందుతారు’ అని కిషన్రెడ్డి తెలిపారు.