హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : ఫేర్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ వారం రోజులుగా ఎయిర్పోర్ట్ట్కు క్యాబ్ సర్వీసులు నిలిపివేసినట్టు తెలంగాణ గిగ్ అండ్ క్యాబ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షేక్ సలావుద్దీన్ తెలిపారు. ఓల, ఉబర్, ర్యాపిడో సర్వీసులు ఎయిర్‌పోర్ట్‌కు బంద్‌చేసి 34 వేల మంది డ్రైవర్లు బంద్‌లో పాల్గొంటున్నట్టు చెప్పారు. తక్కువ చార్జీలు పే చేస్తూ సంస్థ అత్యధికంగా లాగేసుకుంటుందని పేర్కొన్నారు. ప్రైవేట్ సంస్థలను రద్దుచేసి ప్రభుత్వమే క్యాబ్ ఆధారిత యాప్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. గతంలో క్యాబ్ డ్రైవర్లను ఆదుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి మాటిచ్చారని, ఇప్పుడు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం దారణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని క్యాబ్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు.