హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ) : సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమాండ్ చేశారు. స్పీకర్ పదవిని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ చేసిన నీతిమాలిన, రాజ్యాంగ వ్యతిరేక ఫిరాయింపుల రాజకీయానికి అత్యున్నత ధర్మాసనం తీర్పు చెంపదెబ్బ లాంటిదని చెప్పారు. కొందరు ప్రజాప్రతినిధులు అడ్డదారులు తొ కినంత మాత్రాన భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థ నాశనం కాదని నిరూపించిన సుప్రీంకోర్టుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కోర్టులను తప్పుదోవ పట్టించాలన్న కాంగ్రెస్ కుట్రలను ఎదురొని అంతిమంగా సత్యం, ధర్మమే గెలిచిందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును స్పీకర్ వెంటనే అమలు చేయాలని కేటీఆర్ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రాహుల్‌గాంధీ తన నిజాయితీ, నిబద్ధతను నిరూపించుకోవాలని కోరారు. పార్టీ మారితే ఆటోమేటిక్‌గా అనర్హత వర్తించాలని పాంచ్ న్యాయ్ పేరుతో చెప్పిన రాహుల్‌గాంధీ సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతించాలని కోరారు. పాంచ్ న్యాయ్ పేరుతో చెప్పిన నీతులను రాహుల్‌గాంధీ ఆచరణలో చూపించాలని పేర్కొన్నారు
చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అత్యున్నత ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలుచేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాజ్యాంగానికి ధర్మకర్తగా నిలిచే గౌరవ సుప్రీంకోర్టు ఎత్తిచూపిన కాంగ్రెస్ ప్రభుత్వ అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక చర్యలను అడ్డుకోవాలని సూచించారు. పార్టీ ఫిరాయింపులపై రాష్ట్రానికో నీతి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక నీతి, ప్రభుత్వంలో ఉ న్నప్పుడు ఒక నీతి అన్నట్టుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ అవకాశవాద వైఖరిని ప్రశ్నించి తన కు వెన్నెముక ఉన్నదని నిరూపించుకునే అవకాశం రాహుల్‌కు వచ్చిందని తెలిపారు. ఫిరాయింపులను తిరసరించకుంటే రాహుల్చరి త్రహీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు.
ఫిరాయింపులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో స్పీకర్ పదవిని అడ్డం పెట్టుకొని రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని మరింత కాలం అవహేళన చేయరని ఆశిస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు. పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేల విషయంలో మరింత విచారణ అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ప్రతిరోజు పాల్గొంటున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన అనర్హత విధిస్తూ వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజాస్వామిక చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయేలా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. ఇందుకు బీఆర్ఎస్ తరపున సమర్థవంతమైన వాదనలు వినిపించిన న్యాయవాద బృందానికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
బీఆర్ఎస్ తరఫున ఎన్నికైన 10 ఎమ్మెల్యే లు ప్రలోభాలకు లొంగి పార్టీ మారినా కష్టకాలంలో పార్టీ వెంట నిలిచిన లక్షలాదిమంది కా ర్యకర్తలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. 20 నెలల నుంచి రేవంత్ ప్రభుత్వం చేస్తున్న అడ్డగోలు, అప్రజాస్వామిక, అవినీతి రాజకీయాలను ఎండగడుతూ పార్టీకి అండగా ఉన్న కార్యకర్తలు గొప్ప స్ఫూర్తిని చాటారని కొనియాడారు. సుప్రీంకోర్టు తీర్పుతో వచ్చే మూ డు నెలల్లో 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు వస్తాయని భావిస్తున్నట్టు తెలిపారు. ఉప ఎన్నికలకు పార్టీ సిద్ధంగా ఉన్నదని ప్రకటించారు. గెలుపు కోసం పని చేద్దామని కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.