హైదరాబాద్ : ప్రముఖ వ్యాపారవేత్త, మద్రాసి చక్కెర బీడీ వ్యవస్థాపకుడు, కిట్స్ కాలేజి, వరంగల్ పబ్లిక్ స్కూల్ వ్యవస్థాపక సభ్యులు ప్రొద్దుటూరి గంగారెడ్డి (94) కన్నుమూశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం గంగారెడ్డి మృతదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. మద్రాసి చక్కరె బీడి ఫ్యాక్టరీని నెలకొల్పి వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.
వ్యాపారిగా ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచి ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు సైతం చేశారని పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.