Road accident | సూర్యాపేట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన బస్సు.. ముగ్గురు దుర్మరణం
Road accident | సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోతేకు దగ్గరలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఓ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి.
Road accident | సూర్యాపేట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన బస్సు.. ముగ్గురు దుర్మరణం
Road accident: సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోతేకు దగ్గరలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై మధిర డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 12 మంది ఉన్నారని, వారంతా కూలీ పనుల కోసం వెళ్తుండగా ప్రమాదం బారినపడ్డారని పోలీసులు తెలిపారు.
మునగాల మండలం రామ సముద్రానికి చెందిన కూలీలు మోతె మండలం బుర్కచర్లలో మిరప పనులకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. క్షతగాత్రులు సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ఎమ్మెల్సీ ఓటు నమోదులో పాల్గొన్న కంచర్ల రామకృష్ణారెడ్డి
‘మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి’
ENE Repeat | ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ట్రైలర్ అప్డేట్.. వచ్చేస్తోన్న మ్యాడ్ గ్యాంగ్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

